News30th Jan 03:59 PMSunil Byrisetty1 min read

ఆకాంక్షిత బ్లాక్ సూచికలలో నూరు శాతం ఫలితాలను సాధించాలి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెనుగంచిప్రోలు ఆకాంక్షిత మండలం ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడంలో అధికారుల సమిష్టి కృషి అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. పెనుగంచిప్రోలు మండల

ఆకాంక్షిత బ్లాక్ సూచికలలో నూరు శాతం ఫలితాలను సాధించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెనుగంచిప్రోలు ఆకాంక్షిత మండలం ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడంలో అధికారుల సమిష్టి కృషి అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. పెనుగంచిప్రోలు మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ముఖ్య అతిధిగా హాజరై ఆకాంక్షిత బ్లాక్ ల సూచికల అభివృద్ధిని పరిశీలించారు. జిల్లాలో ఎస్ప్రెన్ బ్లాక్లుగా ఉన్న ఇబ్రహీంపట్నం పెనుగంచిప్రోలు పనితీరు గతం కంటే ఎంతో మెరుగుపడిందన్నారు. రెండు మండలాలలో గర్భిణీల రిజిస్ట్రేషన్- వైద్య సేవలు, హైపర్ టెన్షన్ స్క్రీనింగ్, డయాబెటిస్ స్క్రీనింగ్, గర్భిణీలకు పోషకాహారం, భూసార పరీక్ష కార్డుల జారీ, స్వయం సహాయక సంఘాల రివాల్వింగ్ ఫండ్ వంటి సూచకలల్లో 100 శాతం ఫలితాలు సాధించి నీతి ఆయోగ్ నుంచి బంగారు పతకాలను సాధించడం అభినందనీయమన్నారు. సబ్కీ సాథ్, సబీకా వికాస్, సబీకా విశ్వాస్ సబీకా ప్రయాస్ మంత్రంతో గౌరవ ప్రధానమంత్రి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషిచేస్తున్నారన్నారు.
Andhra Pradesh
Guntur
Aspirational Blocks
Penuganchiprolu
District Collector
Block Development
Health Services
Maternal Care
Hypertension Screening
Diabetes Screening
నిది అయ్యోగ్ బంగారు పతకాలు
ప్రభుత్వం పథకాలు
Scroll for the next article