News14th Oct 04:34 PMSunil Byrisetty1 min read

అనధికార బాణసంచా విక్రయాలు ఉండరాదు

అనధికార బాణసంచా నిల్వలు, విక్రయాలు ఉండరాదని గుంటూు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా నిల్వలు, విక్రయాలుపై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫర

అనధికార బాణసంచా విక్రయాలు ఉండరాదు
అనధికార బాణసంచా నిల్వలు, విక్రయాలు ఉండరాదని గుంటూు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా నిల్వలు, విక్రయాలుపై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయాలు, నిలువలు, రవాణా తదితర సందర్భాల్లో ఎక్కడా ఎటువంటి దుర్ఘటనలు, అవాంచిత సంఘటనలు జరగరాదని స్పష్టం చేశారు. నిబంధనలు అమలు అధికారులు పక్కాగా వ్యవహరించాలని, వారు చేపట్టిన అంశాలను ప్రజలకు తెలియజేసి చేపడుతున్న పర్యవేక్షణ పట్ల విశ్వాసం కల్పించాలని ఆదేశించారు. అనధికార బాణాసంచా తయారీ, విక్రయాలు, నిలువలు, రవాణా తదితర అంశాలపై స్పష్టమైన నిఘా, సమాచారం కలిగి ఉండాలని చెప్పారు. రెవిన్యూ, పోలీస్, విపత్తులు - అగ్నిమాపక శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. అన్ని శాఖలు సమష్టిగా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనధికార బాణాసంచా తయారీ, విక్రయాలు, నిలువలు, రవాణా గుర్తిస్తే వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు.
Guntur District Collector
A. Tamim Ansaria
Illegal firecrackers
Firecracker seizures
Diwali safety
Unauthorized manufacturing
Storage and transport
Revenue department
అనధికార బాణసంచా విక్రయాలు ఉండరాదు
Scroll for the next article