Politics20th Mar 12:58 PMSunil Byrisetty1 min read

కూటమి ఖాతాలో గుంటూరు మేయర్

కూటమి ప్రభుత్వ ఖాతాలో మరో మేయర్ పదవి చేరనుంది. రాజధాని జిల్లా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఇటీవల రాజీనామా చేశారు. గుంటూరు మేయర్‌ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. కౌన్సిల్ అత్య

కూటమి ఖాతాలో గుంటూరు మేయర్
కూటమి ప్రభుత్వ ఖాతాలో మరో మేయర్ పదవి చేరనుంది. రాజధాని జిల్లా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఇటీవల రాజీనామా చేశారు. గుంటూరు మేయర్‌ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. కౌన్సిల్ అత్యవసర సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో కౌన్సిల్‌ భేటీ జరగనుంది. సమావేశం నిర్వహణ కోసం కమిషనర్ ప్రభుత్వ అనుమతి కోరారు. సమావేశంలో మేయర్ ఎన్నిక కోసం కౌన్సిల్ తీర్మానం చేసి.. ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. తీర్మానం అనంతరం మేయర్ ఎన్నిక తేదీని ఈసీ ప్రకటించనుంది. గుంటూరు కౌన్సిల్‌లో ప్రస్తుతం కూటమికే ఆధిక్యం ఉండటంతో మేయర్ పీఠం టీడీపీకే దక్కనుంది.
Andhra Pradesh
Guntur
Mayor ysrcp
Manohar Naidu
ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు
Scroll for the next article