News21st Jun 10:42 AMSunil Byrisetty1 min read
మంగళగిరిలో ప్రత్యేక యోగా కార్యక్రమం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర -2025 కార్యక్రమం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. మంగళగిరి -తాడేపల
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర -2025 కార్యక్రమం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మండపం మైదానంలో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వ్యవస్థాపకులు పడమట రాధాకృష్ణ యోగి గురూజీ యోగా సాధకులచే యోగాసనాలు చేయించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో నగర కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతలలతో పాటు పలువురు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.