News10th Sep 11:22 AMSunil Byrisetty1 min read
స్వచ్ఛ వాయు సర్వేక్షన్ అవార్డు గుంటూరుకు గర్వకారణం
కేంద్ర పర్యావరణ, అటవీశాఖ విడుదల చేసిన స్వచ్ఛ వాయు సర్వేక్షన్ 2026లో గుంటూరుకు రెండో స్థానం రావటం గుంటూరు నగర ప్రజలకు గర్వకారణమని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ఉత్
కేంద్ర పర్యావరణ, అటవీశాఖ విడుదల చేసిన స్వచ్ఛ వాయు సర్వేక్షన్ 2026లో గుంటూరుకు రెండో స్థానం రావటం గుంటూరు నగర ప్రజలకు గర్వకారణమని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని హరిత భవన్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో అధికారుల చేతుల మీదుగా అవార్డు తీసుకున్న గుంటూరు నగరపాలక సంస్థ కమీషనర్ మయూర్ అశోక్ ని జనసేన నేతలు సన్మానించారు. ఆళ్ళ హరి మాట్లాడుతూ గుంటూరు ప్రజలకు దేశ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చిన ప్రభుత్వానికి అధికారులకు, సహకరించిన ప్రజలకు అభినందనలు తెలిపారు. వాతావరణంలో వస్తున్న విపరీత మార్పుల నుంచి రక్షణ పొందాలంటే పర్యావరణ పరిరక్షణను ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. సిగ్నల్స్ దగ్గర వాహనాలు ఆపినప్పుడు ఇంజన్ ఆపుచేయాలని దీనిద్వారా ఇంధనం ఆదా కావటమే కాకుండా కాలుష్య ఉద్గారాలను తగ్గించవచ్చన్నారు.