News21st Sep 11:59 AMSunil Byrisetty1 min read

కవుల రేడు...మహాకవి గురజాడ..!

(గురజాడ అప్పారావు జయంతి ప్రత్యేకం) ఆధునిక తెనుగు కవిత్వంలో ఉదయించిన నవాదిత్యుడు మూఢాచారాలను కలం ఖడ్గంతో ఖండించిన అభినవ విక్రమార్కుడు..! ముత్యాలు సరాలను విరచించి ముచ్చటగా తెలుగు తల్

కవుల రేడు...మహాకవి గురజాడ..!
(గురజాడ అప్పారావు జయంతి ప్రత్యేకం) ఆధునిక తెనుగు కవిత్వంలో ఉదయించిన నవాదిత్యుడు మూఢాచారాలను కలం ఖడ్గంతో ఖండించిన అభినవ విక్రమార్కుడు..! ముత్యాలు సరాలను విరచించి ముచ్చటగా తెలుగు తల్లికి వేసిన కవిరేడు ఆయనే కీ.శే. గురజాడ అప్పారావు మహా కవులకాయన గొప్పారావు కవుల లోకానికి కట్టేను.. కవనపు మేడ...! వాడుక భాషా కవితలకు లంగరెత్తెను అచ్చతెనుగులో విచ్చు భావాలు చూపించె నవకవితలకు జవసత్వాలు కలగించే భారత దేశమంటే మనుషులని మట్టికాదని గట్టిగా వక్కాణించి మాతృభూమి పట్ల దేశభక్తిని ప్రకటించే...! ఛాందస వాదాల తోక చుక్కలను కత్తిరించె జ్ఞానమొక్కటే నిలుచునని ప్రవక్తలా చెప్పే అంటరాని తనాన్ని మెడలో మాలగా ధరించె కన్యాశుల్కాలను కళ్లకు కట్టినట్టు రచించి పుత్తడిబొమ్మ పూర్ణమ్మలను కాపాడినాడు మహాకవి గురజాడ అప్పారావు తెలుగు కవన యుగాన పొడిచిన కొత్త రవీంద్రుడు..!
Gurajada Apparao
Telugu Literature
Modern Poetry
Indian Poets
Kaviraju
Telugu Language
Social Reform
Nationalism
Literary Legacy
మహాకవి
తెలుగు భాష
సాంస్కృతిక చిహ్నం
సాహితీ విప్లవం
Scroll for the next article