News9th May 12:03 PMSunil Byrisetty2 min read

మక్కాకు వెళ్లే హజ్ యాత్రికులకు నగదు పంపిణీ

దాచేపల్లి టౌన్‌లోని విజయభాస్కర్ కళ్యాణమండపంలో గురజాల ఎమ్మె్ల్యే యరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గం నుంచి మక్కా వెళ్లే హజ్ యాత్రికులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి నగదు పంపి

మక్కాకు వెళ్లే హజ్ యాత్రికులకు నగదు పంపిణీ
దాచేపల్లి టౌన్‌లోని విజయభాస్కర్ కళ్యాణమండపంలో గురజాల ఎమ్మె్ల్యే యరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గం నుంచి మక్కా వెళ్లే హజ్ యాత్రికులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి నగదు పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ అధ్యక్షతన ముస్లిం మత పెద్దలు ఖురాన్ పఠనంతో ప్రారంభించారు. హజ్‌కు వెళ్తున్న దాచేపల్లికి చెందిన షేక్ యూనుస్ ఫౌజియా బేగం దంపతులు, మాచవరం మండలం తురకపాలానికి చెందిన షేక్ నాగుల్ మీరా, ఫాతిమా బి దంపతులు, మొహమ్మద్ అష్రఫ్ అహమ్మద్, షేక్ హసీనా దంపతులు వీరికి రూ. లక్ష చొప్పున ముఖ్య అతిధుల చేతుల మీదుగా యరపతినేని శ్రీనివాసరావు అందజేసి ఘన సన్మానం చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషాకి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్‌ను యరపతినేని ఘనంగా సన్మానం చేశారు. షేక్ హసన్ బాషా, మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా ఇటువంటి పవిత్ర కార్యక్రమం జరిగిన దాఖలాలు లేవని, యరపతినేని మొదటి నుంచి మైనార్టీల పక్షపాతిగా అండగా ఉంటున్నారని, ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకునే హజ్‌కు గతంలో కూడా 48 మందికి రూ. 48 లక్షలు ఇచ్చి పంపారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో వారి వల్ల నష్టం జరిగిన మైనార్టీ సోదరులను కూడా ఆదుకున్న తీరు, ముస్లిం మైనార్టీలకు అండగా ఉన్న తీరు, మహా గొప్పదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ మంచి కార్యకర్త అయినటువంటి సుభాని గుండెపోటుతో మరణిస్తే ఆయన కుటుంబం రోడ్డున పడకుండా వారిని కాపాడి వారి ఇల్లు తాకట్టులో ఉన్న రూ. 3 లక్షలు ఇచ్చి విడిపించడం మామూలు విషయం కాదంటూ కొనియాడారు. యరపతినేని మాట్లాడుతూ, "1994 నుంచి ఎమ్మెల్యేగా మైనార్టీలకు అండగా నిలవడం జరిగిందని, షాదిఖానాలు, మదర్సాల నిర్మాణానికి పూనుకున్నానని, సొంత నిధులతో పిడుగురాళ్లలో ఈద్గా కట్టడం చేశానని వివరించారు టిటిడి బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ," 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు హజ్‌కి వెళ్లే ముస్లిం మైనార్టీ సోదరులకు, ఆర్థికంగా రూ. లక్ష ఇచ్చి పంపించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు గురజాల నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మీర్జా ఆబిద్ హుస్సేన్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు చైర్మన్ పులుకూరి కాంతారావు, పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ తురక వీరస్వామి, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ బాబావలి, పల్నాడు జిల్లా మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అమిర్ అలీ, గురజాల నియోజవర్గ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్లా ఆఫీసాబ్, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు, జనసేన కామిశెట్టి రమేష్, టీడీపీ, జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు.
Palnadu District
Yarapathineni Srinivasa Rao
Hajj pilgrims
మక్కా హజ్ యాత్రికులకు నగదు పంపిణీ
షేక్ యూనుస్ ఫౌజియా బేగం
Scroll for the next article