Spiritual29th Jul 10:55 AMSunil Byrisetty1 min read
గురుపౌర్ణమికి మూలం.. మహర్షి వేదవ్యాసుడు
మనమంతా గొప్పగా జరుపుకొనే గురుపౌర్ణమికి మూల కారణం మహర్షి వేదవ్యాసుడు. కృష్ణ ద్వైపాయన వేదవ్యాసుడు జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజునే మనం వ్యాసపౌర్ణమి లేదా గురుపౌర్ణమి అంటాం. ఆయన వేద
మనమంతా గొప్పగా జరుపుకొనే గురుపౌర్ణమికి మూల కారణం మహర్షి వేదవ్యాసుడు. కృష్ణ ద్వైపాయన వేదవ్యాసుడు జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజునే మనం వ్యాసపౌర్ణమి లేదా గురుపౌర్ణమి అంటాం. ఆయన వేదాలను 4గా విభజించారు. మహాభారతం రచించారు. 18 పురాణాలు రాశారు. బ్రహ్మ సూత్రాలు అంటే వేదాంత సారాన్ని 555 సూత్రాలుగా రాశారు. కౌరవులు, పాండవులు, భీష్ముడు, విదురుడు.. అందరికీ ఆయన గురువు. జ్ఞానాన్ని క్రమబద్ధం చేసి, మనకు అందించినందుకు మొత్తం మానవజాతికే ఆయన గురువు. అందుకే గురుపౌర్ణమి రోజున ముందు వేదవ్యాసుడిని పూజించి, తర్వాత మన గురువులకు దండం పెడతాం.
గురువు గురించి వ్యాసుల వారి మాట
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః'
వేదవ్యాసుడు = జ్ఞానానికి మూలం. ఆయన లేకపోతే మనకు మహాభారతం, పురాణాలు, భగవద్గీత ఏమీ తెలిసేవి కావు.