Education12th Jan 10:31 AMSunil Byrisetty1 min read
బాలికల విద్య దేశ అభివృద్ధిలో కీలక పాత్ర
బాలికల విద్య సామాజిక మార్పుకు నాంది అని పేర్కొంటూ అది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఒడిశా రాష్ట్ర గవర్నర్ ఉంగుటూరు మండలంలో
బాలికల విద్య సామాజిక మార్పుకు నాంది అని పేర్కొంటూ అది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఒడిశా రాష్ట్ర గవర్నర్ ఉంగుటూరు మండలంలోని ఉంగుటూరులో నివేదిత గురుకులం నూతన భవనం ప్రారంభోత్సవం, అదేవిధంగా ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురుకులం అనేది కేవలం విద్యను అందించే సంస్థ మాత్రమే కాదని, అది ఒక సంపూర్ణ జీవన విధానాన్ని బోధిస్తుందని, క్రమశిక్షణ, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు.
బాలికల విద్యకు అంకితమైన గురుకులం సామాజిక మార్పుకు శక్తివంతమైన కేంద్రంగా నిలుస్తుందన్నారు. బాలికల విద్యా అనేది ఒక అవకాశం కాదని, అది దేశ భవిష్యత్తును నిర్మించే మౌలిక అవసరమని బలంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. నివేదిత గురుకులం పూర్తిగా బాలికల విద్యకే అంకితమై ఉండటం ఎంతో ప్రశంసనీయమన్నారు.
బాలికల విద్య దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఒక బాలిక విద్యను పొందితే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుందని, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందితే సమాజం బలపడుతుందని, సమాజం బలపడితే దేశం ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు.