News6th Aug 04:22 PMSunil Byrisetty1 min read
సీఎం స్పూర్తితో మార్గదర్శులుగా ప్రజాప్రతినిధులు
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పూర్తితో బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. టీడీపీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వినుకొండలోని ఎస్టీ వర్గాలకు చెందిన 1
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పూర్తితో బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. టీడీపీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వినుకొండలోని ఎస్టీ వర్గాలకు చెందిన 100 కుటుంబాలను దత్తత తీసుకుంటానని సీఎంకు తెలిపారు. తాను నిర్వహిస్తున్న శివశక్తి ఫౌండేషన్ తరపున వారి అభిృద్ధికి కృషి చేస్తానని చీఫ్ విప్ చెప్పారు. అలాగే తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా తన నియోజకవర్గంలో వంద పేద కుటుంబాలను దత్తత తీసుకుంటామని సీఎంకు వివరించారు. పీ4పై ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న వీరిద్దరూ ఈ ప్రకటన చేశారు పీ4 కార్యక్రమం స్పూర్తితో పాఠశాలలు, ట్రిబుల్ ఐటీ వంటివాటిల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేలా కార్యక్రమాలు చేపడుతోన్నట్టు మంత్రి కొలుసు పార్దసారధి సీఎంకు చెప్పారు. పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ముందుకొచ్చిన వీరిని సీఎం అభినందించారు.