Politics7th Aug 03:59 PMSunil Byrisetty1 min read
విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. 10 స్థానాల్లో కూటమి తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది. వైసీపీ కేవలం ఒక్క స్థానానికే పరిమిత
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. 10 స్థానాల్లో కూటమి తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది. వైసీపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. 8 స్థానాలు టీడీపీ, ఒక స్థానం బీజేపీ, ఒక స్థానంలో వైసీపీ విజయం సాధించాయి. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో వైసీపీ నుంచి 24 వార్డు కార్పొరేటర్ పద్మ రెడ్డి విజయం సాధించారు. దీంతో GVMCలో కూటమి మరోసారి సత్తా చాటినట్లయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సహా అన్ని చోట్లా కూటమి పార్టీల హవా కొనసాగుతోంది.