News17th Apr 06:00 PMSunil Byrisetty1 min read
29 నుంచి హజ్ యాత్ర ప్రారంభం
ఏపీలో ఈనెల 29 నుంచి హజ్ యాత్ర ప్రారంభం కానుంది. అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి 1,630
ఏపీలో ఈనెల 29 నుంచి హజ్ యాత్ర ప్రారంభం కానుంది. అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు.
ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి 1,630 మంది హజ్ యాత్రకు వెళ్తున్నారని పేర్కొన్నారు.
గతంలో విజయవాడలో ఉన్న ఎంబార్కేషన్ పాయింట్‌ను తగినంత మంది లేనందున తొలగించారు.
దీంతో హైదరాబాద్, బెంగళూరు నుంచి యాత్రికులు హజ్ వెళ్లనున్నారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళ్లే యాత్రికులకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి ఫరూఖ్ వివరించారు.