Politics17th Apr 04:55 PMSunil Byrisetty1 min read

పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు.. పల్నాడులో చిత్ర విచిత్రాలు

ఏపీలోని పల్నాడు పోలీసులు మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లో అరెస్టు చేసి తీసుకొచ్చిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణిని చూసేందుకు వస్తున్న వైసీపీ నాయకులను అడ్డు

పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు.. పల్నాడులో చిత్ర విచిత్రాలు
ఏపీలోని పల్నాడు పోలీసులు మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లో అరెస్టు చేసి తీసుకొచ్చిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణిని చూసేందుకు వస్తున్న వైసీపీ నాయకులను అడ్డుకునేందుకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఖైదీలకు వేయాల్సిన బేడీల్ని కాస్తా ఏకంగా పోలీసు స్టేషన్ గేట్లకే వేసారు. దీంతో ఈ వ్యవహారం పల్నాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మందకృష్ణ మాదిగ భేటీ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనను ప్రస్తావిస్తూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వివాదాస్పదం కావడంతో దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసిన పోలీసులు.. దాచేపల్లికి తీసుకొచ్చారు. కృష్ణవేణి అరెస్టు సమాచారంతో వైసీపీ నాయకులు దాచేపల్లి పోలీసు స్టేషన్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో ఏకంగా స్టేషన్‌కు ఖైదీలకు వేసే బేడీలు వేసినట్లు తెలుస్తోంది.
YSRCP
dachepally
palnadu district
Handcuffs Police Station Gate
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణి
Scroll for the next article