News4th Sep 05:50 PMSunil Byrisetty1 min read

సరికొత్తగా హస్త కళలు

మారుతున్న అభిరుచులు, హస్త కళలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హస్త కళాకారులకు మెరుగైన జీవనం, ఆర్థిక భరోసా కలిగించేలా చర్యలు చేపట్టాయి. హస్త కళా

సరికొత్తగా హస్త కళలు
మారుతున్న అభిరుచులు, హస్త కళలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హస్త కళాకారులకు మెరుగైన జీవనం, ఆర్థిక భరోసా కలిగించేలా చర్యలు చేపట్టాయి. హస్త కళారూపాల తయారీలో మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీలో శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.35 కోట్లను వెచ్చించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళారూపాలను తయారు చేస్తున్న 770 మంది హస్త కళాకారులకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందుకోసం శిక్షణా కార్యక్రమాలు ఆయా కళారూపాలను బట్టి నెల, రెండు నెలల పాటు ఇవ్వనున్నారని మంత్రి ఎస్.సవిత తెలిపారు. హస్త కళాకారులకు కూడా ఆర్థిక భరోసా కలిగేలా ఆయా కళారూపాల తయారీలో మెరుగైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. ఈ శిక్షణల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.1,35,16,314లను మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.1.01 కోటి నిధులు మంజూరయ్యాయన్నారు. రాష్ట్రంలో ఆయా క్లస్టర్లలో ఉన్న హస్త కళాకారులకు రెండు విధాలుగా శిక్షణివ్వనున్నట్లు వెల్లడించారు.
Andhra Pradesh
Handicrafts
Handicraft Artisans
S Savitha
Artisan Training
Handicraft Training
Traditional Crafts
Modern Designs
Central Government
నైపుణ్యాభివృద్ధి
కళాకారుల సంక్షేమం
హస్తకళల క్లస్టర్లు
ఆర్థిక భరోసా
రూ.1.35 కోట్లు
ఏపీ హస్తకళలు
గ్రామీణ కళాకారులు
Scroll for the next article