News11th Jun 11:51 AMSunil Byrisetty1 min read

రైతు సోదరులకు ఏరువాక శుభాకాంక్షలు

తొలకరికి సన్నద్ధమవుతున్న రైతులకు ఈ ఏడాదంతా మంచి జరిగి... వ్యవసాయం లాభదాయకంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. రైతు సోదరులకు ఏరువాక శుభాకాంక్షలు తెలి

రైతు సోదరులకు ఏరువాక శుభాకాంక్షలు
తొలకరికి సన్నద్ధమవుతున్న రైతులకు ఈ ఏడాదంతా మంచి జరిగి... వ్యవసాయం లాభదాయకంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. రైతు సోదరులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పధకం అమలు చేస్తున్నామన్నారు. విత్తనం నుంచి ధాన్యం కొనుగోలు వరకు అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతులు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అన్ని విధాల ఆదుకునేందుకు అనేక చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది వరుణుడు కూడా కరుణించి ఖరీఫ్ కు ముందుగానే వర్షాలు కురవడంతో ఖరీఫ్ పనులకు సన్నద్ధతకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం కూడా అన్నదాతలకు ముందుగానే వ్యవసాయ యాంత్రికరణతో పాటు భూసార పరీక్షలు కూడా నిర్వహించి రైతులకు వారి భూ సంబంధించిన ఆరోగ్య పత్రాలను అందజేసి రైతులకు వారి భూసారాలను తెలుసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
Andhra Pradesh news
Agriculture Minister Kinjarapu Atchannaidu
Eruvaka pournami
Farmers
Annadata Sukhibhav scheme
రైతు సోదరులకు ఏరువాక శుభాకాంక్షలు
Scroll for the next article