News11th Jan 03:10 PMSunil Byrisetty1 min read

ఇదుగో గులాబీ.. క్షేమంగా వెళ్లి పండుగ చేసుకుని రండి!

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు పూలతో శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘హ్యాపీ జర్నీ’ అంటూ సూర్యాపేట ఎస్పీ నర్సింహ విషెస్ చెబుతున్నారు. సంక్రాంతి పం

ఇదుగో గులాబీ.. క్షేమంగా వెళ్లి పండుగ చేసుకుని రండి!
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు పూలతో శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘హ్యాపీ జర్నీ’ అంటూ సూర్యాపేట ఎస్పీ నర్సింహ విషెస్ చెబుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయవాడకు వెళ్తున్న వాహనదారులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ సందర్భంగా ప్రయాణికులకు పూలు అందజేస్తూ ‘హ్యాపీ జర్నీ’ అంటూ సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వేగ నియంత్రణతో పాటు సీటుబెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని ఎస్పీ సూచించారు. పండుగ వేళ ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. పోలీసుల ఈ ఆత్మీయ పలకరింపునకు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
Sankranti Festival
Happy Journey
Suryapet SP
Traffic Awareness
Road Safety
Police Initiative
సంక్రాంతి ప్రయాణం
హైదరాబాద్–విజయవాడ
ప్రజల భద్రత
పండుగ శుభాకాంక్షలు
Scroll for the next article