News14th Aug 03:10 PMSunil Byrisetty1 min read
బీచ్ రోడ్లో ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ అత్యంత ఉత్సాహంగా సాగింది. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర @2047 లక్ష్య సాధన, అభివృద్
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ అత్యంత ఉత్సాహంగా సాగింది. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర @2047 లక్ష్య సాధన, అభివృద్ధి చెందిన భారత నిర్మాణం అనే 80వ స్వాతంత్ర్య దినోత్సవ థీమ్‌కు అనుగుణంగా నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పింది. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఈ ర్యాలీ సాగింది. దేశభక్తి గీతాలు, భారత్ మాతాకీ జై, వందే మాతరం నినాదాలతో బీచ్ రోడ్ సందడిగా మారింది. కాళీమాత ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను చేతబట్టి ముందుకు సాగారు. విద్యార్థుల ఉత్సాహం, దేశభక్తి నినాదాలు, త్రివర్ణ పతాకాల రెపరెపలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.