News12th Aug 03:46 PMSunil Byrisetty1 min read
దేశభక్తి ఉప్పొంగేలా హర్‌ఘర్ తిరంగా ర్యాలీ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తి ఉప్పొంగేలా హర్‌ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన తిరంగా ర్యాలీని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తి ఉప్పొంగేలా హర్‌ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన తిరంగా ర్యాలీని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. 275 అడుగుల జాతీయ జెండాతో భారీగా హర్‌ఘర్ తిరంగా ర్యాలీ కొనసాగింది. తిరంగా ర్యాలీలో కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 15వ తేదీ వరకు స్వాతంత్య్ర దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.