News11th Aug 12:37 PMSunil Byrisetty1 min read

హ‌ర్ దిల్ తిరంగా.. హ‌ర్ ఘ‌ర్ తిరంగా..

ప్ర‌తి మ‌దిలో, ప్ర‌తి ఇంటిపైనా దేశ‌భ‌క్తిని చాటిచెప్పేలా మువ్వ‌న్నెల జెండా రెప‌రెప‌లాడుతోంద‌ని.. ప్ర‌తి గుండె ఉప్పొంగేలా హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ పంద్రాగ‌స్టు వ

హ‌ర్ దిల్ తిరంగా.. హ‌ర్ ఘ‌ర్ తిరంగా..
ప్ర‌తి మ‌దిలో, ప్ర‌తి ఇంటిపైనా దేశ‌భ‌క్తిని చాటిచెప్పేలా మువ్వ‌న్నెల జెండా రెప‌రెప‌లాడుతోంద‌ని.. ప్ర‌తి గుండె ఉప్పొంగేలా హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ పంద్రాగ‌స్టు వేడుకుల‌కు సిద్ధ‌మ‌వుతున్నామ‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. విజ‌య‌వాడ ఓల్డ్ జీజీహెచ్ వ‌ద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక ర్యాలీ జ‌రిగింది. ఈ ర్యాలీలో విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌, రెవెన్యూ, పోలీస్‌, యువజ‌న సంక్షేమం, వైద్య ఆరోగ్యం త‌దిత‌ర శాఖ‌ల అధికారులు, సిబ్బందితో పాటు వాక‌ర్స్ క్ల‌బ్ వంటి వివిధ అసోసియేష‌న్ల నుంచి పెద్దఎత్తున ప్ర‌తినిధులు, వివిధ క‌ళాశాల‌ల విద్యార్థులు పాల్గొన్నారు. బైక్, సైకిల్ ర్యాలీతో పాటు స్కేటింగ్ చేస్తూ చిన్నారులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచారు. త్రివ‌ర్ణ‌ప‌తాకాలు చేత‌బూని భార‌త్ మాతాకీ జై, వందేమాత‌రం నినాదాల‌తో తుమ్మ‌ల‌ప‌ల్లి వారి క్షేత్ర‌య్య కళాక్షేత్రం, ఓల్డ్ జీజీహెచ్ ర‌హ‌దారులు మార్మోగిపోయాయి. అమ‌ర‌వీరుల బ‌లిదానం.. నేటి స్వేచ్ఛా భార‌తం, త్రివ‌ర్ణ ప‌తాకం ఐక‌మత్యానికి సంకేతం నినాదాల‌తో ర్యాలీ ఉత్సాహంగా సాగింది.
NTR District
Independence Day
Har Ghar Tiranga
Tricolour Flag
Patriotism
Amaraveerulu
Freedom Fighters
Bike Rally
Cycle Rally
Vijayawada GGH
Vande Mataram
ఘర్ తిరంగా
విజయవాడ ర్యాలీ
Scroll for the next article