News29th Nov 12:24 PMSunil Byrisetty1 min read
మంత్రి పీఏపై వేధింపుల ఆరోపణలు.. సీఎంవో సీరియస్
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద అనధికార పీఏగా పనిచేస్తున్న సతీష్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ అయింది. అతడిని తక్ష
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద అనధికార పీఏగా పనిచేస్తున్న సతీష్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ అయింది. అతడిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఓ మహిళ, మంత్రి పీఏ సతీష్ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం సీఎంవో దృష్టికి వెళ్లడంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. సతీష్‌పై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో అతడిని తొలగిస్తూ మంత్రి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. వేధింపులపై విచారణ కొనసాగుతోంది.