News28th Mar 12:01 PMSunil Byrisetty1 min read
రుయాలో వేధింపుల కలకలం.. ఇద్దరిపై వేటు
తిరుపతి రుయా సెంట్రల్ ల్యాబ్‌లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఈ ఘటనపై తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పారా మెడికల్ విద్
తిరుపతి రుయా సెంట్రల్ ల్యాబ్‌లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి.
ఈ ఘటనపై తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పారా మెడికల్ విద్యార్థినులను ఇద్దరు ల్యాబ్ టెక్నిషియన్లు లైంగికంగా వేధించారని 20 మంది పారా మెడికల్ విద్యార్థినులు రాతపూర్వకంగా సూపరింటెండెంటుకు పిర్యాదు చేసారు.
డాక్టర్ల కమిటీ నివేదికతో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లపై వేటు వేశారు.
అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటప్రసాద్, రాజశేఖర్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు.
సమగ్ర విచారణ నిమిత్తం నలుగురు సభ్యులతో కమిటీని నియమించారు.
గతంలో ఎక్స్‌రే విభాగంలో ఇలాగే వేధింపులు జరిగినా చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి.