News20th Dec 11:29 AMSunil Byrisetty1 min read
పేద విద్యార్థిని కోసం.. ఆస్తినే ష్యూరిటీగా పెట్టిన హరీష్ రావు
తన నియోజకవర్గ విద్యార్థిని కోసం ఏకంగా ఆస్తినే తాకట్టు పెట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో పుట్టి పెరిగిన ఓ పేద కుటుంబ యువతి, కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. మెడికల్ పీజీ
తన నియోజకవర్గ విద్యార్థిని కోసం ఏకంగా ఆస్తినే తాకట్టు పెట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో పుట్టి పెరిగిన ఓ పేద కుటుంబ యువతి, కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి సీటు దక్కించుకుంది. కానీ పీజీ ఫీజులకు అవసరమైన రూ.20 లక్షల రుణం కోసం ష్యూరిటీగా పెట్టే ఆస్తి లేక కుటుంబం తీవ్ర ఆందోళనలో పడింది. టైలర్‌గా పనిచేసే తండ్రి ఆదాయం ఇంతటి బాధ్యతను మోయలేదు. లోన్ అందుబాటులో ఉన్నా అది పొందడానికి కావలసిన భూమి, ఇల్లు లేదా ఆస్తి ఏదీ వారివద్ద లేదు. ఈ పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముందుకు వచ్చారు. అమ్మాయి ప్రతిభ, ఆత్మవిశ్వాసం, కష్టం చూసి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్‌కు తన సిద్దిపేట ఇంటినే ష్యూరిటీగా పెట్టారు. అదనంగా, హరీష్ రావు మరొక రూ.1 లక్ష సహాయం కూడా అందించారు. తర్వాత ఆమె కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి “బాగా చదివి పేదల సేవ చేయాలి” అని ఆశీర్వదించారు.