News22nd Oct 04:41 PMSunil Byrisetty1 min read

సుప్రీంకోర్టు ఆదేశాలు చదివావా ధర్మానా?

సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చదివి అర్థం చేసుకోవడం రాని వైసీపీ నాయకుల నుంచి సరైన విశ్లేషణ ఆశించడం మాదే తప్పని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో తానే అత్యంత తె

సుప్రీంకోర్టు ఆదేశాలు చదివావా ధర్మానా?
సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చదివి అర్థం చేసుకోవడం రాని వైసీపీ నాయకుల నుంచి సరైన విశ్లేషణ ఆశించడం మాదే తప్పని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో తానే అత్యంత తెలివైనవాడినని తనకు తాను చెప్పుకునే ధర్మాన సుప్రీంకోర్టు ఆదేశాలు చదివావా? అవి నీకు అర్థమయ్యాయా? అని ప్రశ్నించారు. తుది జాబితా ప్రచురణను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని, నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారనే ఫిర్యాదులు అందితే సంబంధిత సాక్ష్యాధారాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. శాంతిభద్రతల సమస్య కారణంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని నిర్ధారణ అయితే ఆ పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే నామినేషన్ల గడువును పొడిగించాలని, ఆ పొడిగింపు కూడా నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి 48 గంటలు మాత్రమే ఉండాలని స్పష్టం చేసిందన్నారు. ఇంత స్పష్టంగా ఉన్న ఆదేశాలను వక్రీకరించి ప్రభుత్వానికి ‘చెంపదెబ్బ’ అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టే వైసీపీ అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులతో సమానంగా నామినేషన్లు దాఖలు చేయగలిగారని, మేము ప్రజాక్షేత్రంలో తేల్చుకునే వాళ్లమే తప్ప అక్రమంగా అడ్డుకునే వాళ్లం కాదని స్పష్టం చేశారు.
Scroll for the next article