Jobs24th Jan 10:57 AMSunil Byrisetty1 min read

విశాఖకు HCL.. 20 వేల ఉద్యోగాలు!

దావోస్ సదస్సులో భాగంగా HCL టెక్నాలజీస్ సీఈవో & ఎండీ సి. విజయకుమార్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కేవలం మర్యాదపూర్వక భేటీగా కాకుండా, స్పష్టమైన లక్ష్యాలతో, భారీ ప్రతిపాదనలను లో

విశాఖకు HCL.. 20 వేల ఉద్యోగాలు!
దావోస్ సదస్సులో భాగంగా HCL టెక్నాలజీస్ సీఈవో & ఎండీ సి. విజయకుమార్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కేవలం మర్యాదపూర్వక భేటీగా కాకుండా, స్పష్టమైన లక్ష్యాలతో, భారీ ప్రతిపాదనలను లోకేష్ వారి ముందుంచారు. విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ, మేనేజ్డ్ సర్వీసుల కోసం కనీసం 10,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. గన్నవరం క్యాంపస్‌ను రాబోయే 3-5 ఏళ్లలో 20,000 మంది ఉద్యోగులకు విస్తరించాలని, దీన్ని ఏపీలోనే అతిపెద్ద డిజిటల్ ఇంజనీరింగ్ హబ్‌గా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh
IT Jobs
HCL Technologies
Visakhapatnam
Employment Generation
Davos Summit
Nara Lokesh
Digital Engineering Hub
Global Delivery Center
Investment in AP
Scroll for the next article