News23rd Nov 10:28 AMSunil Byrisetty1 min read
భారత్‌లో నంబర్ 1 బ్రాండ్ HDFC బ్యాంక్
HDFC బ్యాంక్ 45 బిలియన్ డాలర్ల విలువతో భారత్‌లోనే అతి పెద్ద, అతి విలువైన బ్రాండ్‌గా అవతరించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ సేవలు అందిస్తూ, సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ, ఈ బ్యాంక్ తన
HDFC బ్యాంక్ 45 బిలియన్ డాలర్ల విలువతో భారత్‌లోనే అతి పెద్ద, అతి విలువైన బ్రాండ్‌గా అవతరించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ సేవలు అందిస్తూ, సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ, ఈ బ్యాంక్ తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. 2025 కాంటార్ బ్రాండ్జ్ (Kantar BrandZ) రిపోర్ట్ ప్రకారం HDFC బ్యాంక్ ఇండియాలోనే అతి పెద్ద, అతి విలువైన బ్రాండ్‌గా నిలిచింది. దీని బ్రాండ్ విలువ 45 బిలియన్ డాలర్లు. గతేడాది కంటే 18 శాతం ఎక్కువ. 2022లో TCS నంబర్ 1 అయింది. కానీ ఇప్పుడు HDFC బ్యాంక్ మళ్లీ అగ్రస్థానం దక్కించుకుంది.
ఇండియాలో అత్యంత విలువైన బ్రాండ్లు
HDFC బ్యాంక్
టీసీఎస్
ఎయిర్‌టెల్
ఇన్ఫోసిస్
ఐసీఐసీ బ్యాంక్
HDFC బ్యాంక్ ఇంత పెద్ద బ్రాండ్ కావడానికి కారణం కస్టమర్ల కోసం ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకురావడం. గ్రామాల్లో బ్యాంక్ బ్రాంచ్ లేకపోయినా సర్వీస్ ఇవ్వడానికి 'బ్యాంకింగ్ కరస్పాండెంట్ సెంటర్లు, ఈ-మిత్రా కియోస్క్‌లు అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్‌లో 30 నిమిషాల్లోనే లోన్ ఇచ్చే 'ఎక్స్‌ప్రెస్ కార్ లోన్' కస్టమర్లకు మరింత చేరువ చేసింది. సైబర్ మోసాల గురించి చెప్పే 'విజిల్ ఆంటీ' వీడియోలు కస్టమర్లను ఆకర్షించాయి.