Telangana4th Sep 10:34 AMSunil Byrisetty1 min read

ఈ ఏటీఎంతో.. 60 రకాల వైద్య పరీక్షలు!

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హెల్త్ ఏటీఎం నిమిషాల్లో నివేదికలు అందిస్తోంది. సాధారణంగా వివిధ వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే.. రోజంతా కేటాయించాలి. ఈసీజీ పరీక్ష కోసం క్యూలో, 2డీ ఇకోకు మ

ఈ ఏటీఎంతో.. 60 రకాల వైద్య పరీక్షలు!
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హెల్త్ ఏటీఎం నిమిషాల్లో నివేదికలు అందిస్తోంది. సాధారణంగా వివిధ వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే.. రోజంతా కేటాయించాలి. ఈసీజీ పరీక్ష కోసం క్యూలో, 2డీ ఇకోకు మరో గంట.. ఇలా ఎంతో సమయం పడుతుంది. అయితే ఒకే పరికరంతో సుమారు 60 రకాల వైద్య పరీక్షలు చేసి.. నిమిషాల వ్యవధిలోనే రిపోర్ట్‌ ఇచ్చే హెల్త్‌ ఏటీఎంను ఢిల్లీకి చెందిన క్లినిక్స్‌ ఆన్‌ క్లౌడ్‌ అనే అంకుర సంస్థ రూపొందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. పైలట్‌ ప్రాజెక్టుగా కింగ్‌కోఠి లోని జిల్లా ఆసుపత్రిలో, మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో ఈ ఏటీఎంలను ఏర్పాటుచేసింది. ఈ యంత్రంపై నిల్చుంటే ఈసీజీ, హెచ్‌బీఏ1సీ, లిపిడ్, హిమోగ్లోబిన్, మధుమేహం, రక్తపోటు, పల్మనరీ ఫంక్షన్, కార్డియో వాస్క్యులర్‌ అసెస్‌మెంట్, డెంగీ, మలేరియా తదితర అనేక రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తుంది.
Telangana news
Health ATM
Hyderabad
Medical Technology
Healthcare Innovation
Diagnostics
తెలంగాణ
క్లినిక్స్ ఆన్ క్లౌడ్
హెల్త్ చెకప్
డిజిటల్ హెల్త్
మెడికల్ రిపోర్ట్స్
Scroll for the next article