Health19th Apr 10:09 AMSunil Byrisetty1 min read

సబ్జా సైజు చిన్నదే.. అన్ లిమిటెడ్ ప్రయోజనాలు!

సబ్జా గింజలను నిత్యం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు మందులు వాడకుండా పరిష్కారమవుతాయి. సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. తరచూ డీహైడ్రేషన్కు

సబ్జా సైజు చిన్నదే.. అన్ లిమిటెడ్ ప్రయోజనాలు!
సబ్జా గింజలను నిత్యం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు మందులు వాడకుండా పరిష్కారమవుతాయి. సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. తరచూ డీహైడ్రేషన్కు గురయ్యే వారు సబ్జా గింజల పానీయం తాగితే మంచిది. వికారంగా, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం ఉత్తమం. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని నిత్యం పిల్లలకు తాగిస్తే మంచిది. వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు దగ్గరకు రావు. సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనె కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను నివారించొచ్చు. రక్తం శుద్ధి అవుతుంది. ఊబకాయంతో బాధపడే చాలా మందికి సబ్జా గింజల పానీయం చాలా మంచిది.
Sabja Seeds
Good for Diabetes Management
Heart Health
iron
Calcium
ఫ్యాటీ యాసిడ్లు
పీచు పదార్థం సమృద్ధి
రక్తం శుద్ధి
Scroll for the next article