News12th Aug 01:45 PMSunil Byrisetty1 min read
ప్రతి ఒక్కరి ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు పునాది
రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంక్షేమ విభాగం (MCH Block), ప్రత్యేక నూతన శిశు సంరక్షణ యూనిట్లు (SNCU–1, SNCU–2), *పెడియాట్రిక్ ఐసీయూ (PICU)*ల
రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంక్షేమ విభాగం (MCH Block), ప్రత్యేక నూతన శిశు సంరక్షణ యూనిట్లు (SNCU–1, SNCU–2), *పెడియాట్రిక్ ఐసీయూ (PICU)*లను ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రి వసతులను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. రోగుల సమస్యలు, అవసరాలు, అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ విభాగాలు తల్లి, శిశువుల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రత్యేకించి అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. “ప్రతి తల్లి, శిశువు ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు పునాది. అందుకే మేము ఆసుపత్రులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సమగ్ర సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని కూటమి ప్రభుత్వం పరిరక్షించేందు చిత్తశుద్ధి తో పనిచేస్తోంది” అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, రామకృష్ణ రెడ్డి, బలరామ్ కృష్ణ , ఎంఎల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు.