News2nd Dec 11:54 AMSunil Byrisetty1 min read
ప్రభుత్వ వైద్య రంగంలోకి సేవలందించేందుకు ముందుకు రావాలి
వైద్య విద్యను పూర్తి చేశాక ప్రభుత్వ వైద్య రంగంలో సేవలందించేందుకు ముందుకు రావాలని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. నిరుపేదలకు సేవ చేసే భాగ్యం ప్రభ
వైద్య విద్యను పూర్తి చేశాక ప్రభుత్వ వైద్య రంగంలో సేవలందించేందుకు ముందుకు రావాలని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. నిరుపేదలకు సేవ చేసే భాగ్యం ప్రభుత్వ వైద్య రంగంలో కలుగుతుందన్నారు. 'నన్ను డాక్టర్ ని చేయాలని నా సోదరి తపన పడింది.. కానీ ఆరోగ్య శాఖా మంత్రినయ్యాను. మంత్రి అయ్యాక వైద్యారోగ్య శాఖకు సంబంధించి అనేక విషయాల్ని డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బంది నుంచి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేను కూడా మెడికల్ స్టూడెంట్‌నే...' అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కృష్ణా జిల్లా చిన అవుట్‌పల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్దార్ధ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ 2025 బ్యాచ్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. సమాజంలో ఏ వృత్తికీ లేనంత గౌరవం, ప్రాధాన్యత వైద్య వృత్తికి ఉందన్నారు. రానురాను వైద్య వృత్తిలో విలువలు తగ్గుతున్నాయని, వ్యాపారమైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్యనభ్యసించిన మీరంతా అంకిత భావంతో పనిచేయాలన్నారు. వైద్య వృత్తికి మానవతావాదాన్ని, సేవాభావాన్ని అద్ది ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడిననాడే వైద్యులకు గౌరవం పెరుగుతుందన్నారు. పదేళ్ల కాలంలో 73,000 ఎంబిబియస్ సీట్లు రావడంలోనూ, పీజీ సీట్లు రెండు రెట్లు పెరగడంలోనూ ప్రధాని మోడీ కృషి ఉందన్నారు.