News20th Sep 04:45 PMSunil Byrisetty1 min read
జిఎస్టి సంస్కరణలతో ఆరోగ్య సంరక్షణకు భరోసా
దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న జియస్టీ నూతన సంస్కరణల వల్ల ప్రజల ఆరోగ్య సంరక్షణకు మరింత భరోసా పెరిగిందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగ
దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న జియస్టీ నూతన సంస్కరణల వల్ల ప్రజల ఆరోగ్య సంరక్షణకు మరింత భరోసా పెరిగిందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా ప్రీమియంపై ఇప్పటివరకు ఉన్న 18 శాతం జియస్టీని తొలగిస్తున్నందున మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొన్నారు. జీయస్టీ నూతన సంస్కరణల కారణంగా కొన్ని రకాల మందులు, సర్జరీలకు సంబంధించిన పరికరాల ధరలు తగ్గుతాయని చెప్పారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన జారీ చేశారు. ముఖ్యంగా నూతన జిఎస్టి సంస్కరణలను స్వాగతిస్తూ శాసనసభలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ చేసిన ప్రకటనులు, జరిగిన ఏకగ్రీవ తీర్మానం శుభ పరిణామo ధన్యవాదాలు తెలియజేస్తున్న అని పేర్కొన్నారు.