Politics19th Aug 02:02 PMSunil Byrisetty1 min read

వైసీపీ హయాంలో పెట్టించిన కేసులు క్వాష్!

వైఎస్ వివేకా హత్యకేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసును జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కే. సింగ్ ధర్మాసనం విచారించింది. సునీత తరపు లాయర్ సిద్ధా

వైసీపీ హయాంలో పెట్టించిన కేసులు క్వాష్!
వైఎస్ వివేకా హత్యకేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసును జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కే. సింగ్ ధర్మాసనం విచారించింది. సునీత తరపు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వివేకా కుమార్తె సునీత తరపు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. దర్యాప్తును ముగించడానికి సుప్రీంకోర్టు విధించిన గడువే కారణమని సీబీఐ చెబుతోందని తెలిపారు. ఈ కేసులో ఇంకా మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, హత్య వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో తేల్చాల్సి ఉందని అన్నారు. నిందితులు సాక్షులను బెదిరించడంతో పాటు సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని లూథ్రా ఆరోపించారు. ఈ సందర్భంగా సునీత దంపతులు, సీబీఐ అధికారి రాంసింగ్‌పై పెట్టిన కేసులను రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
Andhra Pradesh
YSRCP
Supreme Court
Viveka Murder Case
Avinash Reddy
Bail Cancellation
Sunitha
CBI
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు
Scroll for the next article