News15th Mar 03:25 PMSunil Byrisetty1 min read

ఆ మూడు రోజులు జాగ్రత్త!

మార్చిలోనే మంటెత్తిపోతోంది. సూర్యుడు నిప్పులు చెరిగేస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్ చివర్లో, మే నెలలో ఉండే స్థాయిలో ఉష్ణోగ్రతలు, వేడి గాలులు మార్చిలోనే వీస్తున్నాయి. ఇప్పటి నుంచే ఎండ

ఆ మూడు రోజులు జాగ్రత్త!
మార్చిలోనే మంటెత్తిపోతోంది. సూర్యుడు నిప్పులు చెరిగేస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్ చివర్లో, మే నెలలో ఉండే స్థాయిలో ఉష్ణోగ్రతలు, వేడి గాలులు మార్చిలోనే వీస్తున్నాయి. ఇప్పటి నుంచే ఎండ వేడిమిని తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఈ నెల 16 వరకు కోస్తాలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా నిన్న ప్రకాశంలోని పెద్దదోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA వెల్లడించింది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
AP Temperature
Summer 2025
Andhra Paradesh Heat wave
ఉష్ణోగ్రతలు
వేడి గాలులు
Scroll for the next article