News22nd Oct 02:07 PMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రి క్షేత్రానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ
విజయవాడ దుర్గమ్మ వారి ఆలయానికి గురువారం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భవాని భక్తులు భవానిపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు ఇతర ప్రాంతాలలో
విజయవాడ దుర్గమ్మ వారి ఆలయానికి గురువారం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భవాని భక్తులు భవానిపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు ఇతర ప్రాంతాలలో తమ వాహనాలు పార్కింగ్ చేసుకుంటున్నారు. సితార సెంటర్ ప్రాంతంలోనూ వాహనాలు పార్కింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంలో ప్రజలు భక్తులందరూ ట్రాఫిక్ పోలీసువారికి సహకరించాలని మనవి చేస్తున్నారు. భవానిపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు లో వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ పోలీస్ అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో పర్యవేక్షణ చేస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు. దసరా తర్వాత కూడా దుర్గమ్మ దర్శనానికి లక్షన్నర మందికిపైగా భక్తులు విచ్చేశారు.