News13th Jul 04:46 PMSunil Byrisetty1 min read

వరదపై అప్రమత్తంగా ఉండండి

గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండటంతో అప్రమత్తం కావాలని ప్రభుత్వం సూచించింది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిప

వరదపై అప్రమత్తంగా ఉండండి
గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండటంతో అప్రమత్తం కావాలని ప్రభుత్వం సూచించింది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ప్రస్తుతం ఇన్-ఫ్లో, అవుట్-ఫ్లో కలిపి 5.29 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తున్నట్లు పేర్కొంది. అయితే రేపటి నుంచి వరద నీరు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద నీటిలో ఈత కొట్టడం, చేపలు పట్టడం, ప్రయాణించడం లేదా స్నానం చేయడం ప్రమాదకరమని, ప్రజలు అలాంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించింది.
Andhra Pradesh news
rajamundry
HEAVY FLOODS TO GODAVARI
Dowleswaram Cotton Barrage
గోదావరి వరద
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Scroll for the next article