News5th Jul 08:46 AMSunil Byrisetty1 min read

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద!

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. కర్ణాటక, నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలతో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. జలాశయం వద్ద ఇన్ ఫ్లో 1,22,630 క్యూసెక్కులు ఉండగా. ఔట్ ఫ్

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద!
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. కర్ణాటక, నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలతో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. జలాశయం వద్ద ఇన్ ఫ్లో 1,22,630 క్యూసెక్కులు ఉండగా. ఔట్ ఫ్లో 67,019 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. కాగా ప్రస్తుత నీటిమట్టం 876.90 అడుగులకు చేరింది. వరద నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Andhra Pradesh news
Srisailam Project
flood water
Water level
Nallamalla forest
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద
Scroll for the next article