News31st Oct 10:38 AMSunil Byrisetty1 min read
ఏపీకి మరో ముప్పు.. 2, 3 తేదీల్లో అప్రమత్తం!
నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు (115.6–204.4 మి.మీ.), రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని @IMDWeather హెచ్చరించింది. గంటకు 40–50 కి.మ
నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు (115.6–204.4 మి.మీ.), రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని @IMDWeather హెచ్చరించింది. గంటకు 40–50 కి.మీ. వేగంతో గాలులు, గరిష్ఠంగా 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచవచ్చు. నవంబర్ 4న కూడా కోస్తాంధ్రలో భారీ వర్ష సూచన ఉంది. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం: అక్టోబర్ 31 నాటికి అంటే ఈ రోజుకి వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD అంచనా. తదుపరి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే సూచనలున్నాయి. అయితే తుపానుగా మారుతుందని ఇంకా నిర్ధారణ కాలేదు. గత 24 గంటల్లో ఏపీలో నగరం 91.5 మి.మీ., తణుకు 81.2, చోడవరం 80.2, వేలంగి 76.9, మచిలీపట్నం 76.7 మి.మీ. వర్షపాతం నమోదైంది.