News4th Nov 12:13 PMSunil Byrisetty1 min read

తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం

తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈశాన్య రుతు పవనాలు బలహీనపడటంతో ఎండ, వానలతో కూడిన మిశ్రమ వాతావరణం ఏర్పడింది. మొంథా తుఫాన్ తర్వాత తేమ శాతం తగ్గిపోవడంతో పొడి వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం
తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈశాన్య రుతు పవనాలు బలహీనపడటంతో ఎండ, వానలతో కూడిన మిశ్రమ వాతావరణం ఏర్పడింది. మొంథా తుఫాన్ తర్వాత తేమ శాతం తగ్గిపోవడంతో పొడి వాతావరణం కొనసాగి ఎండ తీవ్రత పెరిగింది. శీతాకాలంలో సైతం ఉక్కపోత పెరిగింది. సాధారణం కంటే మూడు డిగ్రీలు కంటే ఎక్కువ పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మయన్మార్ తీరం దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడనుంగా దాని ప్రభావం ఏపీ వైపు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈనెల 10వ తేదీ తర్వాత ఈశాన్య రుతు పవనాలు మళ్ళీ యాక్టివేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి తమిళనాడును అనుకుని ఉన్న దక్షిణ కోస్తా. రాయలసీసులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోసారి వర్షం హెచ్చరికలతో రైతుల్లో కలవరం మొదలైంది.
Andhra Pradesh
Telugu States
Weather Update
Telangana
Northeast Monsoon
Cyclone Montha
Rain Alert
Heat Wave
Climate Change
Rayalaseema
వర్షాల హెచ్చరిక
ఎండ తీవ్రత
వాతావరణ మార్పులు
రాయలసీమ
తీర ఆంధ్ర
Scroll for the next article