Telangana18th Sep 05:51 PMSunil Byrisetty1 min read
మళ్లీ భారీ వర్షం.. వాతావరణ శాఖ అలర్ట్
హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం దంచికొడుతుంది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వానకే నగరం అతలాకుతలమైంది. గంట వ్యవధిలోనే 10 సె
హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం దంచికొడుతుంది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వానకే నగరం అతలాకుతలమైంది. గంట వ్యవధిలోనే 10 సెం. మీలకు పైగా వర్షపాతం నమోదైంది. మళ్లీ భారీ వర్షం కురుస్తుండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అలర్ట్స్ జారీ అయ్యాయి. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.