News10th Aug 11:19 AMSunil Byrisetty1 min read

ఢిల్లీలో కుండపోత!

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి నుంచి కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఇవ

ఢిల్లీలో కుండపోత!
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి నుంచి కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఇవాళ సైతం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో విమాన సర్వీసులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. భారీ వర్షాలతో 200లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని కన్నౌట్‌ ప్యాలెస్‌, మథుర రోడ్డు, భారత్‌ మండపం సహా పలు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Rains
Delhi
capital city
heavy downpour
low-lying areas
waterlogging
red alert
meteorological department
flight services
delays
traffic issues
Connaught Place
Mathura Road
వర్షాలు
ఢిల్లీ
రాజధాని
కుంభవృష్టి
Scroll for the next article