News22nd Mar 11:07 AMSunil Byrisetty1 min read

దంచి కొట్టిన జోరు వాన

తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి వర్షం జోరుగా కురిసింది. ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణలోని చాలా జ

దంచి కొట్టిన జోరు వాన
తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి వర్షం జోరుగా కురిసింది. ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌లో సైతం పెద్ద శబ్దాలతో ఉరుములు, మెరుపులతో జోరు వాన పడింది. పలు జిల్లాల్లో వరి, మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయి. చాలా చోట్ల భారీ వృక్షాలు సైతం విరిగిపడ్డాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాలు, ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు వర్షాలు ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించి, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Heavy rain
Hyderabad
కరీంనగర్
నిజామాబాద్
Scroll for the next article