News23rd Mar 09:21 AMSunil Byrisetty1 min read

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు

రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమై ఉండి పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపా

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు
రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమై ఉండి పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు చెట్లు పోల్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. మరోవైపు మన్యం(D) పాలకొండ, సీతంపేట,అల్లూరి(D) చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు(D), వేలేరుపాడు మండలాల్లో(6) వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఇవాళ కర్నూలు(D) ఆస్పరి,శ్రీ సత్యసాయి (D) తొగరకుంటలో 40.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే శనివారం శ్రీసత్యసాయి జిల్లా ఒరవోయ్ లో 34మిమీ, వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లి 27మిమీ, ముద్దనూరులో 19.7 మిమీ, కర్నూలు జిల్లా వెల్దుర్తిలో 18.7 మిమీ వర్షపాతం, 17 ప్రాంతాల్లో 10 మిమీకు పైగా వర్షపాతం నమోదైందన్నారు.
AP Rains
Summer heat
Weather report
రోణంకి కూర్మనాథ్
Scroll for the next article