News15th Nov 11:08 AMSunil Byrisetty1 min read

ఏపీకి తుఫాన్ ముప్పు.. అలర్ట్!

బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది. రానున్న గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నవంబర్ 16 నాటికి తుఫాన్‌గా, 18 నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశ

ఏపీకి తుఫాన్ ముప్పు.. అలర్ట్!
బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది. రానున్న గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నవంబర్ 16 నాటికి తుఫాన్‌గా, 18 నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో నవంబర్ 18, 19 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం వైపు తుఫాన్ కదిలే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనించాలని సూచించారు.
Scroll for the next article