News10th Sep 08:37 AMSunil Byrisetty1 min read

మళ్ళీ భారీ వర్షాలు.! హెచ్చరికలు

భారీ వర్షాలు మళ్ళీ తెలుగు రాష్ట్రాలను ముంచెత్తానున్నాయి. వరుసగా వానలు కురవనున్నాయి. తూర్పు దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు దక్షిణ ఒడిస్సా సమీపంలోన

మళ్ళీ భారీ వర్షాలు.! హెచ్చరికలు
భారీ వర్షాలు మళ్ళీ తెలుగు రాష్ట్రాలను ముంచెత్తానున్నాయి. వరుసగా వానలు కురవనున్నాయి. తూర్పు దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు దక్షిణ ఒడిస్సా సమీపంలోని ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుండి 4.5 కి.మీ ఎత్తులో చక్రవాక ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ రోజు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది.
Heavy Rains
Weather Alert
Andhra Pradesh
Telangana
IMD Alert
Rain Update
Cyclone Effect
AP Weather
TS Weather
మళ్లీ భారీ వర్షాలు
హెచ్చరికలు జారీ
మత్స్యకారుల హెచ్చరిక
Scroll for the next article