News26th Aug 11:53 AMSunil Byrisetty1 min read
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం!
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సమాచారం.
నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే నేడు విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన చేశారు. కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేశారు. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.