News12th Aug 09:10 AMSunil Byrisetty1 min read

మరో అల్పపీడనం.. 5 రోజులు భారీ వర్షాలు!

భారత వాతావరణ విభాగం బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. అది వాయుగుండంగా బలపడి, శనివారం నాటికి తీరం దాటొచ్చని అంచనా ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో మంగళవ

మరో అల్పపీడనం.. 5 రోజులు భారీ వర్షాలు!
భారత వాతావరణ విభాగం బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. అది వాయుగుండంగా బలపడి, శనివారం నాటికి తీరం దాటొచ్చని అంచనా ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవొచ్చని భావిస్తున్నాయి. మరోవైపు రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు వైఎస్సార్‌ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వానలు పడ్డాయి. సోమవారం పల్నాడు, తూర్పుగోదావరి, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, బాపట్ల తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
Andhra Pradesh Weather
Low Pressure in Bay of Bengal
Heavy Rain Alert
IMD Forecast
Amaravati Meteorological Centre
Alluri Sitarama Raju District
East Godavari
భారీ వర్షాల హెచ్చరిక
ఏలూరు
కృష్ణా జిల్లా
గుంటూరు
ప్రకాశం
Scroll for the next article