News28th Aug 10:34 AMSunil Byrisetty1 min read
ఏపీలోనూ భారీ వర్షాలు!
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లు
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
గంపలగూడెం మండలం వినగడప- తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద ఉధృతి నెలకొంది. శివారు 20 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతోంది.