News26th Oct 05:31 PMSunil Byrisetty1 min read

ఏపీలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్

ఏపీలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ తీవ్రత పెరిగితే రాష్ట్రం మొత్తం స్కూ్ళ్లకు సెలవు ప్రకటించే అ

ఏపీలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్
ఏపీలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ తీవ్రత పెరిగితే రాష్ట్రం మొత్తం స్కూ్ళ్లకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. నేడు కాకినాడ తీరం దాటే అవకాశం ఉండటంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కాకినాడ సమీపంలో మొంథా తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉప్పాడ బీచ్ రోడ్డు మూసివేశారు. సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి ఎవరూ రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30 వరకు ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేశారు. తుఫాన్ ప్రభావిత మండలాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
Andhra Pradesh
Cyclone Alert
Chandrababu Naidu
High Alert
Kakinada
Montha Cyclone
Andhra Weather
AP Government
Storm Warning
Coastal Andhra
తీర ప్రాంతాలు
విపత్తు నిర్వహణ
కంట్రోల్ రూమ్స్
ఉప్పాడ బీచ్
పాఠశాల సెలవులు
Scroll for the next article