News3rd Oct 02:06 PMSunil Byrisetty1 min read
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. సీఎం వీసీ
ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సు ద్వారా భారీ వర్షాలు, వరద పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థిత
ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సు ద్వారా భారీ వర్షాలు, వరద పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గొట్టా బ్యారేజ్ క్యాచ్ మెంట్లో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీలు మేర వర్షపాతం నమోదైందని తెలిపారు. గొట్టా బ్యారేజికి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని, ఒడిశాలో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా విశాఖ నగరం కంచరపాలెం లో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఒకరు మృతి చెందినట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.