News23rd Sep 05:26 PMSunil Byrisetty1 min read

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. విద్యుత్ శాఖ అప్రమత్తం

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. విద్యుత్ శాఖ అప్రమత్తం
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో వర్షాల పరిస్థితి, విద్యుత్ సరఫరా, క్షేత్రస్థాయిలో చేపట్టిన ముందస్తు చర్యలపై బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిని పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్యలు తలెత్తిన తర్వాత స్పందించే విధానం కాకుండా, పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
Scroll for the next article