News22nd Sep 04:38 PMSunil Byrisetty1 min read
మరో 4 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోంది. గంటకు 18 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోంది. కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. రేపు రాత్రి విశాఖ-గోపాలపూర్ మధ్య తీరం దాటే ఛాన్స్
బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోంది. గంటకు 18 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోంది. కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. రేపు రాత్రి విశాఖ-గోపాలపూర్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మరో 4 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.